Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు

CSK Scores 192 Against KKR in IPL Match
Advertisement
  • కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే
  • 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్
  • కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. చెపాక్ స్టేడియం వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫలితంగా కోల్‌కతా ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో సంజూ శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే చెలరేగాడు. కేవలం 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి స్కోరు బోర్డుకు ఊపు తెచ్చాడు. మరోవైపు సంజూ శాంసన్ నిలకడగా ఆడి 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ తర్వాత డివాల్డ్ బ్రెవిస్ (41), సర్ఫరాజ్ ఖాన్ (23) కూడా రాణించడంతో చెన్నై భారీ స్కోరు దిశగా సాగింది. పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి శుభారంభం అందుకుంది.

కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా నరైన్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే వైభవ్ అరోరా 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
Advertisement
Advertisement
Chennai Super Kings
CSK vs KKR
IPL 2026
Sanju Samson
Kolkata Knight Riders
Ruturaj Gaikwad
Chepauk Stadium
T20 Cricket
Indian Premier League
Karthik Tyagi

More Telugu News